16, నవంబర్ 2021, మంగళవారం

శివ శివ భవ భవ శరణమ్

రచన: నారాయణతీర్థులు
రాగం: సౌరాష్ట్రం
తాళం: ఆది


పల్లవి:
శివ శివ భవ భవ శరణమ్
మమభవతు సదా తవ స్మరణమ్‌

చరణాలు:
గంగాధర చంద్రచూడ జగన్మంగళ సర్వలోకనీడ - 1

కైలాసాచలవాస శివకర పురహర దరహాస - 2

భస్మోద్ధూళితదేహ శంభో పరమపురుష వృషవాహ - 3

పంచానన ఫణిహేష శివపరమపురుష మునివేష - 4

ఆనందనటనవినోద సచ్చిదానంద విదళితఖేద - 5

నవవ్యాకరణస్వభావ శివనారాయణతీర్థదేవ - 6

7, నవంబర్ 2021, ఆదివారం

హెచ్చరికగా రారా హే రామచంద్ర

రచన: శ్రీ త్యాగరాజ స్వామి
రాగం: యదుకుల కాంభోజి
తాళం: ఆది

పల్లవి:
హెచ్చరికగా రారా హే రామచంద్ర
హెచ్చరికగా రారా హే సుగుణసాంద్ర

అనుపల్లవి:
పచ్చ విల్తునికన్న పాలిత సురేంద్ర (హెచ్చరిక)

చరణాలు:
కనకమయమౌ మకుటకాంతి మెరయగను
ఘనమైన కుండల యుగంబు కదలగను
ఘనమైన నూపుర యుగంబు ఘల్లనను
సనకాదులెల్ల కని సంతసిల్లగను ॥ 1 ॥

ఆణిముత్యాల సరులల్లలాడగను
వాణిపతీంద్రులిరు వరుసపొగడగను
మాణిక్య సోపానమందు మెల్లగను
వీణపల్కుల వినుచు వేడ్కచెల్లగను ॥ 2 ॥

నినుజూడవచ్చు భగినికరంబు చిలుక
మనసురంజిల్ల నీ మహిమలను పలుక
మినువాసులెల్ల విరులను చాల జిలుక
ఘనత్యాగరాజు కనుగొన ముద్దు గులుక ॥ 3 ॥

1, నవంబర్ 2021, సోమవారం

ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా

రచన: త్యాగరాజు స్వామి
రాగం: మధ్యమావతి 
తాళం: ఆది

పల్లవి:
ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా
ముదితలార జూతాము రారే

అనుపల్లవి:
పచ్చని దేహిని పరమ పావనిని
పార్వతిని తలచుచును హరుడేగెడు

చరణాలు:
చిల్లర వేల్పుల రీతి నరుల కర
పల్లవములను తళుక్కనుచు బిరుదు-
లెల్ల మెరయ నిజ భక్తులు పొగడగ
ఉల్లము రంజిల్ల
తెల్లని మేనున నిండు సొమ్ములతో
మల్లె హారములు మరి శోభిల్లగ
చల్లని వేళ సకల నవ-రత్నపు
పల్లకిలో వేంచేసి వచ్చు - 1

హితమైన సకల నైవేద్యంబుల
సమ్మతమున అడుగడుగుకారగింపుచు
మితము లేని ఉపచారములతో-
నతి సంతోషమున సతతము
జప తపములనొనరించు
నత జనులకభీష్టములవ్వారిగ
వెతగియొసగుదుననుచు పంచ నదీ
పతి వెడలి సొగసు మీరగ వచ్చు - 2

భాగవతులు హరి నామ కీర్తనము
బాగుగ సుస్వరములతో వింత
రాగములనాలాపము సేయు
వైభోగములను జూచి
నాగ భూషణుడు కరుణా నిధియై
వేగము సకల సు-జన రక్షణమున
జాగ-రూకుడై కోర్కెలనొసగు
త్యాగరాజు తాననుచును వచ్చు - 3


23, అక్టోబర్ 2021, శనివారం

బాలగోపాలకృష్ణ పాహి పాహి

రచన: శ్రీ నారాయణ తీర్థులు
రాగం: మోహన
తాళం: ఆది

పల్లవి:
బాలగోపాలకృష్ణ పాహి పాహి॥

అనుపల్లవి:
నీలమేఘశరీరా నిత్యానందం దేహి॥ 

చరణాలు:
కలభసుందరగమన కస్తూరిశోభితానన 
నళినదళాయతనయన నందనందన
మిళితగోపవధూజన మీనాంకకోటిమోహన
దళితసంసారబంధన దారుణవైరినాశన ॥ 1 ॥

యజ్ఞ యజ్ఞసంరక్షణ యాదవవంశాభరణ
యజ్ఞఫలవితరణ యతిజనతారణ
అజ్ఞానఘనసమీరణ అఖిలలోకకారణ
విజ్ఞానదళితావరణ వేదాంతవాక్యప్రమాణ ॥ 2 ॥

వ్యత్యస్తపాదారవింద విశ్వవందితముకుంద
సత్యాఖండబోధానంద సద్గుణబృంద
ప్రత్యస్తమితభేదకంద పాలితనందసునంద
నిత్యద నారాయణతీర్థ నిర్మలానందగోవింద ॥ 3 ॥

16, అక్టోబర్ 2021, శనివారం

శివగంగానగర నివాసిని

రచన: పాపనాశన్ శివన్
రాగం: పున్నాగవరాళి
తాళం: ఆది 


పల్లవి:
శివగంగానగర నివాసిని
శ్రీ రాజరాజేశ్వరి మామవ 

అనుపల్లవి:
అభయవరదే అంబ మాయే
నిగమాగణిత విభవే పరశివజాయే 

చరణాలు:
వదనరుచి విజిత కమలే
ఉభయపార్శ్వ విరాజిత వాణీకమలే ॥ 1 ॥ 

సదా రామదాసనుతే శరణాగత
జనపాలన శుభచరితే ॥ 2 ॥

9, అక్టోబర్ 2021, శనివారం

శ్రీ కాళహస్తీశ శ్రిత జనావన


రచన: ముత్తుస్వామి దీక్షితార్
రాగం: హుసేని 
తాళం: ఝంప 

పల్లవి:
 సమీరాకార
మాం పాహి రాజమౌళే ఏహి 

అనుపల్లవి:
పాకారి విధి హరి ప్రాణమయ కోశానిలాకాశభూమిసలిలాగ్నిప్రకాశ శివ 

చరణం:
జ్ఞాన ప్రసూనాంబికా పతే భక్తాభిమాన
దక్షిణ కైలాస వాసాభీష్ట దాన -
చతుర కరాబ్జ దీన కరుణానిధే
సూన శర సూదనేశాన భవ పశుపతే
(మధ్యమ కాల సాహిత్యం)
జ్ఞాన గురు గుహ సచ్చిదానంద-మయ మూర్తే
హీన జాతి కిరాతకేన పూజిత కీర్తే

3, అక్టోబర్ 2021, ఆదివారం

శ్రీచాముండేశ్వరి‌ పాలయమాం


రచన: శ్రీ మైసూరు వాసుదేవాచార్య
రాగం: బిళహరి
తాళం: ఆది 

పల్లవి:
శ్రీచాముండేశ్వరి‌ పాలయమాం కృపాకరిశంకరి శ్రితజనపాలిని మహాబలాద్రివాసిని మహిషాసురమర్దిని 

అనుపల్లవి:
వాచామగోచర మహిమవిరాజితే వరగుణభరితే
వాక్పతిముఖసురవందితే వాసుదేవసహజాతే 

చరణం:
రాకనిశాకరసన్నిభవదనే రాజీవలోచనే
రమణీయకుందరదనే రక్షితభువనేమణిసదనే మూకవాక్ప్రదానవిఖ్యాతే మునిజననుతసుప్రీతే
శ్రీకరతారకమంత్ర తోషిత చిత్తే సదా నమస్తే 





10, ఆగస్టు 2021, మంగళవారం

నటేశం నమామి సతతమ్

రచన: వి సుబ్రహ్మణ్య పిళ్ళై
రాగం: మణిరంగు
తాళం: రూపకం

పల్లవి:
నటేశం నమామి సతతం
నగజా నాయకమ్ ॥ నటేశం ॥

అనుపల్లవి:
జటాధరం జలజకరం
జగదాధారం ధీరం ॥ నటేశం ॥ 

చిత్తస్వరం:
స ని ప మ
త ఝమ్ త రి త
స రి ప మ
త ధిం గి ణ తోం
త కిట ఝం త
ప ణి స ణం త
మ ప రి ప రి
త క త ధిం గి ణ తోం

చరణం:
భవరోగాది విఘాతం
భక్తకోటిజనవినుతం
శివకామవల్లీసహితం
సుబ్రహ్మణ్యప్రియతాతం ॥ నటేశం ॥

26, జులై 2021, సోమవారం

చింతయ మాకంద

రచన: ముత్తుస్వామి దీక్షితులు
రాగం: భైరవి
తాళం: రూపకం

పల్లవి:
చింతయ మాకంద మూలకందం చేత శ్రీ సోమస్కందం 
॥చింతయ ॥

అనుపల్లవి: 
సంతతం అఖండ సచ్చిదానందం సమ్రాజ్యప్రద చరణారవిందం ॥ చింతయ ॥

చరణం:
మంగళకర మందహాసవదనం మాణిక్యమయ కాంచిసదనం
అంగసౌందర్య విజితమదనం అంతక సూదనం కుందరదనం
( మధ్యమ కాల సాహిత్యం )
ఉత్తుంగ కమనీయవృషతురంగం
భైరవి ప్రసంగం గురుగుహాంతరంగం పృథ్వీలింగం ॥ చింతయ ॥

25, ఏప్రిల్ 2021, ఆదివారం

దేవాదిదేవ శ్రీవాసుదేవ

రాగం : సునాద వినోదిని
తాళం : ఆది
రచన : మైసూరు వాసుదేవాచార్యులు

దేవాదిదేవ శ్రీవాసుదేవ
కావుమయ్య నన్ను కరుణాలవాల  ॥ దేేవా ॥

ఈ వేళ నా యారు శత్రులను
నీవే పారద్రోలి నిజ భక్తు జేసి ॥ దేవా ॥

నే చేసిన పూజాఫలమో
నా పూర్వజుల పుణ్యఫలమో    
శ్రీ జానకీశ ఈ జన్మమిచ్చి
నన్ను ధన్యునిగ భావిజేసితివి ॥ దేవా ॥

14, మార్చి 2021, ఆదివారం

నీరజదళ నయన హరేకృష్ణ

రాగం: వాసంతి
తాళం: ఆది
రచయిత: మన్నార్‌గుడి సాంబశివ అయ్యర్

నీరజదళ నయన హరేకృష్ణ
నిరుపమగుణనిధియే హరేకృష్ణ || నీరజ||

నవతులసీ వనమాలా ధారీ
కువలయదళ నయన || నీరజ||

మందరోద్ధర మామనోహర
బృందావన ముకుందా గోవిందా || నీరజ ||

శంఖచక్రధర శ్రీగోవిందా
పంకజ లోచనా పరమానంద || నీరజ||

7, మార్చి 2021, ఆదివారం

బాలగోపాలకృష్ణ పాహి పాహి






రచన: నారాయణతీర్థులు
రాగం: మోహనం
తాళం:ఆది

బాల గోపాల కృష్ణ పాహి పాహి।
నీల మేఘ శరీరా నిత్యానందం దేహి॥

కలభ సుందర గమన కస్తూరి శోభితానన 
నళిన దళాయత నయన నందనందన।
మిళిత గోపవధూజన మీణాంక కోటి మోహన
దళిత సంసారబంధన దారుణ వైరినాశన॥

యజ్ఞ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ
యజ్ఞ ఫల వితరణ యతి జనతారణ।
అజ్ఞాన ఘనసమీరణ అఖిల లోకకారణ
విజ్ఞాన దళితావరణ వేదాంత వాక్యప్రమాణ॥

వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద
సత్యాఖండ బోధానంద సద్గుణబృంద।
ప్రత్యస్తమిత భేదకంద పాలిత నంద సునంద
నిత్యద నారాయణతీర్థ నిర్మలానంద గోవింద ॥