7, నవంబర్ 2021, ఆదివారం

హెచ్చరికగా రారా హే రామచంద్ర

రచన: శ్రీ త్యాగరాజ స్వామి
రాగం: యదుకుల కాంభోజి
తాళం: ఆది

పల్లవి:
హెచ్చరికగా రారా హే రామచంద్ర
హెచ్చరికగా రారా హే సుగుణసాంద్ర

అనుపల్లవి:
పచ్చ విల్తునికన్న పాలిత సురేంద్ర (హెచ్చరిక)

చరణాలు:
కనకమయమౌ మకుటకాంతి మెరయగను
ఘనమైన కుండల యుగంబు కదలగను
ఘనమైన నూపుర యుగంబు ఘల్లనను
సనకాదులెల్ల కని సంతసిల్లగను ॥ 1 ॥

ఆణిముత్యాల సరులల్లలాడగను
వాణిపతీంద్రులిరు వరుసపొగడగను
మాణిక్య సోపానమందు మెల్లగను
వీణపల్కుల వినుచు వేడ్కచెల్లగను ॥ 2 ॥

నినుజూడవచ్చు భగినికరంబు చిలుక
మనసురంజిల్ల నీ మహిమలను పలుక
మినువాసులెల్ల విరులను చాల జిలుక
ఘనత్యాగరాజు కనుగొన ముద్దు గులుక ॥ 3 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి