16, నవంబర్ 2021, మంగళవారం

శివ శివ భవ భవ శరణమ్

రచన: నారాయణతీర్థులు
రాగం: సౌరాష్ట్రం
తాళం: ఆది


పల్లవి:
శివ శివ భవ భవ శరణమ్
మమభవతు సదా తవ స్మరణమ్‌

చరణాలు:
గంగాధర చంద్రచూడ జగన్మంగళ సర్వలోకనీడ - 1

కైలాసాచలవాస శివకర పురహర దరహాస - 2

భస్మోద్ధూళితదేహ శంభో పరమపురుష వృషవాహ - 3

పంచానన ఫణిహేష శివపరమపురుష మునివేష - 4

ఆనందనటనవినోద సచ్చిదానంద విదళితఖేద - 5

నవవ్యాకరణస్వభావ శివనారాయణతీర్థదేవ - 6

7, నవంబర్ 2021, ఆదివారం

హెచ్చరికగా రారా హే రామచంద్ర

రచన: శ్రీ త్యాగరాజ స్వామి
రాగం: యదుకుల కాంభోజి
తాళం: ఆది

పల్లవి:
హెచ్చరికగా రారా హే రామచంద్ర
హెచ్చరికగా రారా హే సుగుణసాంద్ర

అనుపల్లవి:
పచ్చ విల్తునికన్న పాలిత సురేంద్ర (హెచ్చరిక)

చరణాలు:
కనకమయమౌ మకుటకాంతి మెరయగను
ఘనమైన కుండల యుగంబు కదలగను
ఘనమైన నూపుర యుగంబు ఘల్లనను
సనకాదులెల్ల కని సంతసిల్లగను ॥ 1 ॥

ఆణిముత్యాల సరులల్లలాడగను
వాణిపతీంద్రులిరు వరుసపొగడగను
మాణిక్య సోపానమందు మెల్లగను
వీణపల్కుల వినుచు వేడ్కచెల్లగను ॥ 2 ॥

నినుజూడవచ్చు భగినికరంబు చిలుక
మనసురంజిల్ల నీ మహిమలను పలుక
మినువాసులెల్ల విరులను చాల జిలుక
ఘనత్యాగరాజు కనుగొన ముద్దు గులుక ॥ 3 ॥

1, నవంబర్ 2021, సోమవారం

ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా

రచన: త్యాగరాజు స్వామి
రాగం: మధ్యమావతి 
తాళం: ఆది

పల్లవి:
ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా
ముదితలార జూతాము రారే

అనుపల్లవి:
పచ్చని దేహిని పరమ పావనిని
పార్వతిని తలచుచును హరుడేగెడు

చరణాలు:
చిల్లర వేల్పుల రీతి నరుల కర
పల్లవములను తళుక్కనుచు బిరుదు-
లెల్ల మెరయ నిజ భక్తులు పొగడగ
ఉల్లము రంజిల్ల
తెల్లని మేనున నిండు సొమ్ములతో
మల్లె హారములు మరి శోభిల్లగ
చల్లని వేళ సకల నవ-రత్నపు
పల్లకిలో వేంచేసి వచ్చు - 1

హితమైన సకల నైవేద్యంబుల
సమ్మతమున అడుగడుగుకారగింపుచు
మితము లేని ఉపచారములతో-
నతి సంతోషమున సతతము
జప తపములనొనరించు
నత జనులకభీష్టములవ్వారిగ
వెతగియొసగుదుననుచు పంచ నదీ
పతి వెడలి సొగసు మీరగ వచ్చు - 2

భాగవతులు హరి నామ కీర్తనము
బాగుగ సుస్వరములతో వింత
రాగములనాలాపము సేయు
వైభోగములను జూచి
నాగ భూషణుడు కరుణా నిధియై
వేగము సకల సు-జన రక్షణమున
జాగ-రూకుడై కోర్కెలనొసగు
త్యాగరాజు తాననుచును వచ్చు - 3