7, నవంబర్ 2015, శనివారం

మరుగేలరా ఓ రాఘవా...

రచన: శ్రీ త్యాగరాజు
రాగం:  జయంతశ్రీ
తాళం: దేశాది

పల్లవి:
మరుగేలరా ? ఓ రాఘవ ! ॥ మరుగేలరా ॥

అనుపల్లవి:
మరుగేల ? చరాచర రూప ! పరా -
త్పర ! సూర్య సుధాకర లోచన ! ॥ మరుగేలరా ॥

పల్లవి:
అన్ని నీవనుచు నంతరంగమున
దిన్నగ వెదకి - తెలుసుకొంటినయ్య;
నిన్నెగాని మదిని నెన్నజాల నొరుల,
నన్ను బ్రోవవయ్యా, త్యాగరాజనుత ! ॥ మరుగేలరా ॥

5, నవంబర్ 2015, గురువారం

సాకేతనగరనాథ....

రచన: మైసూర్ సదాశివ రావు
కీర్తన: సాకేతనగరనాథ
రాగం: హరికాంభోజి
తాళం: రూపకం

పల్లవి:
సాకేతనగరనాథ శ్రీకాంత జగన్నాథ ॥ సాకేత ॥

అనుపల్లవి:
లోకేేేేశచిద్విలాస లోకావనచతుర మాంపాహి దేవదేవ మునిజనహిత సురపతినుత శుభదచరిత దశరథసుఖ జనకజారమణ దేవరిపుణాసజన ॥ సాకేత ॥

చరణం:
రాజితామరపాల రామచంద్రభూపాల రాజరాజవందిత చరణయుగళ దీనపాల ఇనరాజవంశరత్న సదాశివకవినుత జితసపత్న దశరథసుత జనకజారమణ దేవరిపు నాశచణ ॥ సాకేత ॥

9, సెప్టెంబర్ 2015, బుధవారం

రామ రామ గోవింద...

రచన: శ్రీ త్యాగరాజ స్వామి.
రాగం: సౌరాష్ట్రం
తాళం: ఆది

పల్లవి:
రామ రామ గోవింద నను
రక్షించు ముకుంద  ॥ ॥

చరణములు:
కలియుగ మనుజులు నీకు మహాత్మ్యము
కలదు లేదనే కాలమాయెగా ॥ రామ ॥

కామునిదాసులు నా పలుకుల విని
కావలసినటులనాడనాయె కదా ॥ రామ ॥

పామరులనుకని సిగ్గుపడుచు మరి
మోము మరుగు జేసి తిరుగనాయెను ॥ రామ ॥

క్రొవ్వుగలనరుల కొనియాడగ చిరు
నవ్వులతో నను జూడనాయె కదా ॥ రామ ॥

మతిహీనులు శ్రీ పతిదాసులకీ
గతి రారాదని పల్కనాయె కదా ॥ రామ ॥

నమ్మినాడనే పేరుకైన నీ
తమ్మునితోనైన పల్కవైతివి ॥ రామ ॥

కార్యాకార్యము సమమాయెను నీ
శౌర్యమెందు దాచుకొంటివయ్యో ॥ రామ ॥

రాక రాక బ్రతుకిట్లాయెను శ్రీ
త్యాగరాజనుత తరుణము కాదు ॥ రామ ॥

29, ఆగస్టు 2015, శనివారం

సుగుణములే చెప్పకొంటి...

రచన: శ్రీ త్యాగరాజు
రాగం: చక్రవాక
తాళం: రూపకం

పల్లవి:
సుగుణములే చెప్పుకొంటి
సుందర రఘురామ ॥ సుగుణములే ॥

అనుపల్లవి:
వగలెఱుంగలేక ఇటు వత్తువనుచు
దురాసచే  ॥ సుగుణములే ॥

చరణము:
స్నానాది సుకర్మంబులు
వేదాధ్యయనంబు లెఱుఁగ
శ్రీనాయక క్షమియించుము
శ్రీ త్యాగరాజవినుత ॥ సుగుణములే ॥

8, ఆగస్టు 2015, శనివారం

ఓ రఘువీరా....

రచన: శ్రీ రామదాసు  
రాగం: మధ్యమావతి 
తాళం:ఆది

పల్లవి:
ఓ రఘువీరా యని నే పిలిచిన
ఓహో యనరాదా రామసారెకు
వేసరి నామది యన్యము
చేరదు యేరా ధీర రాను ॥ ఓ రఘువీరా॥

చరణం - 1:
నీటచిక్కి కరి మాటికి వేసరి
నాటక ధర నీ పాటలు బాపగమేటి
మకరితల మీటికాచు దయయేటికి
నాపై నేటికి రాదో ॥ ఓ రఘువీరా ॥

చరణం - 2:
మున్ను సభను నాపన్నత వేడుచు
నిన్ను కృష్ణయని  ఎన్నగ ద్రౌపదికెన్నో
వలువలిడి మన్నన బ్రోచినవెన్నుడ
నామొర వింటివొ లేదో ॥ ఓ రఘువీరా ॥

చరణం - 3:
బంటునై తినని యుంటె పరాకున
నుంటివి ముక్కంటి వినుత నామజంట
బాయకను వెంట నుండుమనివేడితి
భద్రాచలవాసా ॥ ఓ రఘువీరా ॥

2, ఆగస్టు 2015, ఆదివారం

వినుడిదె రఘుపతి విజయములు....

రచన: తాళ్ళపాక అన్నమాచార్యులు.
రాగం: శంకరాభరణం
తాళం: ఆది

పల్లవి:
వినుడిదె రఘుపతి విజయములు
పనుపడి రాక్ష బాధలుడిగెను ॥వినుడిదె॥

చరణములు:
కులగిరులదరెను కుంభినివడకెను
ఇల రాముడు రథమెక్కినను
కలగె వారిధులు కంపించె జగములు
బలు విలునమ్ములు పట్టినను ॥ 1 ॥

పిడుగులు దొరిగెను పెనుగాలి విసరె
తొడిబడ బాణము దొడిగినను
ముడివడె దిక్కులు మొగ్గె దిగ్గజములు
యెడవక రావణునేసినను ॥ 2 ॥

చుక్కలు దుల్లెను స్రుక్కె భూతములు
తొక్కి యసురతల దుంచినను
గక్కున శ్రీ వేంకటగిరి నిలువగ
అక్కజమగు శుభమందరి కొదవె ॥ 3 ॥

రంగాపుర విహార.....

రచన: శ్రీ ముత్తుస్వామి దీక్షితార్
రాగం: బృందావన సారంగ
తాళం: రూపకం

పల్లవి:
రంగాపుర విహార జయ కోదండ
రామావతార రఘువీర శ్రీ ॥ రంగాపుర ॥

అనుపల్లవి:
అంగజ జనక దేవ బృందావన 
సారంగేంద్ర వరద రమాంతరంగా  
శ్యామలాంగ విహంగ తురంగ 
సదయాపాంగ సత్సంగ ॥ రంగాపుర ॥

చరణం:
పంకజాప్త కుల జల నిధి సోమ 
వర పంకజ ముఖ పట్టాభిరామ 
పద పంకజ జిత కామ రఘురామ 
వామాంక గత సీత వర వేష 
శేషాంక శయన భక్త సంతోష 
ఏణాంక రవి నయన మృదుతర భాష 
అకళంక దర్పణ కపోల విశేష ముని
సంకట హరణ గోవింద 
వేంకటరమణ  ముకుంద 
సంకర్షణ మూల కంద
శంకర గురు గుహానంద ॥ రంగాపుర ॥

1, జులై 2015, బుధవారం

బ్రహ్మ కడిగిన పాదము

రచన: శ్రీ అన్నమాచార్యులు
రాగం: ముఖారి
తాళం: ఆది

పల్లవి:
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము ॥ బ్రహ్మ ॥

చరణములు:
చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలఁకక గగనము దన్నిన పాదము
బలరిపుఁ గాచిన పాదము ॥ 1 ॥

కామిని పాపము గడిగిన పాదము
పాము తల నిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపుఁ పాదము ॥ 2 ॥

పరమ యోగులకు బరిపరి విధముల
వరమొసఁగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమపదము నీ పాదము ॥ 3 ॥

27, జూన్ 2015, శనివారం

హిమగిరి తనయే హేమలతే....

రచన: శ్రీ హెచ్ ఎన్ ముత్తయ్య భాగవతార్
రాగం: శుద్ధ ధన్యాసి
తాళం: ఆది

పల్లవి:
హిమగిరి తనయే హేమలతే అంబా
ఈశ్వరి శ్రీ లలితే మామవ  ॥ హిమగిరి ॥

అనుపల్లవి:
రమా వాణి సంసేవిత సకలే
రాజరాజేశ్వరి రామ సహోదరి ॥ హిమగిరి ॥

చరణం:
పాశాఙ్కుశేక్షు దండకరే అంబా
పరాత్పరే నిజ భక్తపరే
ఆశాంబరహరికేశవిలాసే
ఆనంద రూపే అమిత ప్రతాపే ॥ హిమగిరి ॥

26, జూన్ 2015, శుక్రవారం

శ్రీ విఘ్నరాజం భజే...

రచన: ఊత్తుకాడు వేంకటసుబ్బయ్యార్
తాళం: ఖండ చాపు
రాగం: గంభీర నాట

పల్లవి:
శ్రీ విఘ్నరాజం భజే భజేహం భజేహం
భజేహం భజే  తమిహ ॥ శ్రీ విఘ్న ॥

అనుపల్లవి:
సంతతమహం కుంజరముఖం శంకరసుతం
శాంకరి సుతం తమిహ
సంతతమహం దంతి కుంజర ముఖం
అంధకాంతక సుతం తమిహ ॥ శ్రీ విఘ్న ॥

చరణములు:
సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జప
తప సమాధి సుఖ వరదానుకూలం
భావిత సుర ముని గణ భక్త పరిపాలం
భయంకర విషంగ మాతంగ కుల కాలం ॥ 1 ॥

కనక కేయూర హారావళీ కలిత గంభీర గౌర గిరి శోభం స్వశోభం
కామాది భయ భరిత మూఢ మద కలి కలుష ఖండితమఖండప్రతాపం
సనక శుక నారద పతంజలి పరాశర మతంగ ముని సంగ సల్లాపం
సత్యపరమబ్జనయనం ప్రముఖ ముక్తికర తత్త్వమసి నిత్యనిగమాది స్వరూపం ॥ 2 ॥