30, అక్టోబర్ 2018, మంగళవారం

మనవినాలకించ రాదటే

నళినకాంతి - దేశాది

రచన : శ్రీ త్యాగరాజ స్వామి

పల్లవి:
మనవినాలకించ రాదటే
మర్మమెల్ల తెల్పెదనే మనసా || మనవి ||

అనుపల్లవి:
ఘనుడైన రామ చంద్రుని
కరుణాంతరంగము తెలిసిన నా || మనవి ||

చరణము:
కర్మ కాండ మతాకృష్టులై భవ
గహన చారులై గాసి జెందగ
కని మానవావతారుడై
కనిపించినాడే నడత త్యాగరాజు || మనవి ||

29, ఆగస్టు 2018, బుధవారం

అపరాధినపరాధిని రామయ్య

భైరవి - ఆట

రచన : శ్రీ తూము నరసింహ దాసు

పల్లవి:
అపరాధినపరాధిని రామయ్య, నే

అనుపల్లవి:
అపరాధి నపరాధి నపరాధి నోరామ
నెపము లెంచక ప్రోచు నెరదాత వీవె

చరణములు:
దిన మెనిమిదిజాముల నొక్క గడియయైన
మనసు నిలిపి నీదు మహిమ వర్ణించి
ఘనులసంగతిఁ గూడి కాలముఁ గడపక
కడు మదమున ముందు గననైతి నకటా - 1

అరిషడ్వర్గములచే నలసటఁ జెందుచు
దురితములకు లొంగి దుఃఖ మందుచును
పరమభక్తులఁ జూచి పరియాచకముఁజేసి
అరసి సద్గతి మార్గనెరుగనైతి నయ్యయో - 2

వాసిగ భద్రాద్రివాసుని దాసాను
దాసుఁడనఁగ భువి భాసిల్లి వేడు
ఆశచే నరసింహదాసుఁడనై భవ
పాశము లెడ జిమ్మి దోసిలొగ్గితినయ్యా - 3

7, నవంబర్ 2015, శనివారం

మరుగేలరా ఓ రాఘవా...

రచన: శ్రీ త్యాగరాజు
రాగం:  జయంతశ్రీ
తాళం: దేశాది

పల్లవి:
మరుగేలరా ? ఓ రాఘవ ! ॥ మరుగేలరా ॥

అనుపల్లవి:
మరుగేల ? చరాచర రూప ! పరా -
త్పర ! సూర్య సుధాకర లోచన ! ॥ మరుగేలరా ॥

పల్లవి:
అన్ని నీవనుచు నంతరంగమున
దిన్నగ వెదకి - తెలుసుకొంటినయ్య;
నిన్నెగాని మదిని నెన్నజాల నొరుల,
నన్ను బ్రోవవయ్యా, త్యాగరాజనుత ! ॥ మరుగేలరా ॥

5, నవంబర్ 2015, గురువారం

సాకేత నగర నాథ....

రచన: మైసూర్ సదాశివ రావు
కీర్తన: సాకేత నగర నాథ
రాగం: హరికాంభోజి
తాళం: రూపకం

పల్లవి:
సాకేత నగర నాథ శ్రీకాంత జగన్నాథ ॥ సాకేత ॥

అనుపల్లవి:
లోకేష చిద్విలాస లోకావన చతుర మాం పాహిదేవదేవ మునిజన హిత సురపతినుత శుభద చరితదశరత సుఖ జనకజారమణ దేవరిపుణా సజన ॥ సాకేత ॥

చరణం:
రాజితామర పాల రామచంద్ర భూపాల రాజరాజ వందిత చరణ యుగళ దీన పాల ఇనరాజవంశ రత్న సదాశివ కవినుత జిత సపత్న దశరథ సుత జనకజా రమణ దేవ రిపు నాషచణ ॥ సాకేత ॥

9, సెప్టెంబర్ 2015, బుధవారం

రామ రామ గోవింద...

రచన: శ్రీ త్యాగరాజ స్వామి.
రాగం: సౌరాష్ట్రం
తాళం: ఆది

పల్లవి:
రామ రామ గోవింద నను
రక్షించు ముకుంద  ॥ ॥

చరణములు:
కలి యుగ మనుజులు నీకు మహాత్మ్యము
కలదు లేదనే కాలమాయెగా ॥ రామ ॥

కాముని దాసులు నా పలుకుల విని
కావలసినటులనాడనాయె కదా ॥ రామ ॥

పామరులను కని సిగ్గు పడుచు మరి
మోము మరుగు జేసి తిరుగనాయెను ॥ రామ ॥

క్రొవ్వు గల నరుల కొనియాడగ చిరు
నవ్వులతో నను జూడనాయె కదా ॥ రామ ॥

మతి హీనులు శ్రీ పతి దాసులకీ
గతి రారాదని పల్కనాయె కదా ॥ రామ ॥

నమ్మినాడనే పేరుకైన నీ
తమ్మునితోనైన పల్కవైతివి ॥ రామ ॥

కార్యాకార్యము సమమాయెను నీ
శౌర్యమెందు దాచుకొంటివయ్యో ॥ రామ ॥

రాక రాక బ్రతుకిట్లాయెను శ్రీ
త్యాగరాజ నుత తరుణము కాదు ॥ రామ ॥

29, ఆగస్టు 2015, శనివారం

సుగుణములే చెప్పకొంటి...

రచన: శ్రీ త్యాగరాజు
రాగం: చక్రవాక
తాళం: రూపకం

పల్లవి:
సుగుణములే చెప్పుకొంటి
సుందర రఘురామ ॥ సుగుణములే ॥

అనుపల్లవి:
వగలెఱుంగలేక ఇటు వత్తువనుచు
దురాసచే  ॥ సుగుణములే ॥

చరణము:
స్నానాది సుకర్మంబులు
వేదాధ్యయనంబు లెఱుఁగ
శ్రీనాయక క్షమియించుము
శ్రీ త్యాగరాజవినుత ॥ సుగుణములే ॥

8, ఆగస్టు 2015, శనివారం

ఓ రఘువీరా....

రచన: శ్రీ రామదాసు  
రాగం: మధ్యమావతి 
తాళం:ఆది

పల్లవి:
ఓ రఘువీరా యని నే పిలిచిన
ఓహో యనరాదా రామసారెకు
వేసరి నామది యన్యము
చేరదు యేరా ధీర రాను ॥ ఓ రఘువీరా॥

చరణం - 1:
నీటచిక్కి కరి మాటికి వేసరి
నాటక ధర నీ పాటలు బాపగమేటి
మకరితల మీటికాచు దయయేటికి
నాపై నేటికి రాదో ॥ ఓ రఘువీరా ॥

చరణం - 2:
మున్ను సభను నాపన్నత వేడుచు
నిన్ను కృష్ణయని  ఎన్నగ ద్రౌపదికెన్నో
వలువలిడి మన్నన బ్రోచినవెన్నుడ
నామొర వింటివొ లేదో ॥ ఓ రఘువీరా ॥

చరణం - 3:
బంటునై తినని యుంటె పరాకున
నుంటివి ముక్కంటి వినుత నామజంట
బాయకను వెంట నుండుమనివేడితి
భద్రాచలవాసా ॥ ఓ రఘువీరా ॥