రచన: ముత్తుస్వామి దీక్షితులు
రాగం: భైరవితాళం: రూపకం
పల్లవి:
చింతయ మాకంద మూలకందం చేత శ్రీ సోమస్కందం
॥చింతయ ॥
అనుపల్లవి:
సంతతం అఖండ సచ్చిదానందం సమ్రాజ్యప్రద చరణారవిందం ॥ చింతయ ॥
చరణం:
మంగళకర మందహాసవదనం మాణిక్యమయ కాంచిసదనం
అంగసౌందర్య విజితమదనం అంతక సూదనం కుందరదనం
( మధ్యమ కాల సాహిత్యం )
ఉత్తుంగ కమనీయవృషతురంగం
భైరవి ప్రసంగం గురుగుహాంతరంగం పృథ్వీలింగం ॥ చింతయ ॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి