రచన: శ్రీ త్యాగరాజ స్వామి.
రాగం: సౌరాష్ట్రం
తాళం: ఆది
పల్లవి:
రామ రామ గోవింద నను
రక్షించు ముకుంద ॥ ॥
చరణములు:
కలియుగ మనుజులు నీకు మహాత్మ్యము
కలదు లేదనే కాలమాయెగా ॥ రామ ॥
కామునిదాసులు నా పలుకుల విని
కావలసినటులనాడనాయె కదా ॥ రామ ॥
పామరులనుకని సిగ్గుపడుచు మరి
మోము మరుగు జేసి తిరుగనాయెను ॥ రామ ॥
క్రొవ్వుగలనరుల కొనియాడగ చిరు
నవ్వులతో నను జూడనాయె కదా ॥ రామ ॥
మతిహీనులు శ్రీ పతిదాసులకీ
గతి రారాదని పల్కనాయె కదా ॥ రామ ॥
నమ్మినాడనే పేరుకైన నీ
తమ్మునితోనైన పల్కవైతివి ॥ రామ ॥
కార్యాకార్యము సమమాయెను నీ
శౌర్యమెందు దాచుకొంటివయ్యో ॥ రామ ॥
రాక రాక బ్రతుకిట్లాయెను శ్రీ
త్యాగరాజనుత తరుణము కాదు ॥ రామ ॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి