7, మార్చి 2021, ఆదివారం

బాలగోపాలకృష్ణ పాహి పాహి






రచన: నారాయణతీర్థులు
రాగం: మోహనం
తాళం:ఆది

బాల గోపాల కృష్ణ పాహి పాహి।
నీల మేఘ శరీరా నిత్యానందం దేహి॥

కలభ సుందర గమన కస్తూరి శోభితానన 
నళిన దళాయత నయన నందనందన।
మిళిత గోపవధూజన మీణాంక కోటి మోహన
దళిత సంసారబంధన దారుణ వైరినాశన॥

యజ్ఞ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ
యజ్ఞ ఫల వితరణ యతి జనతారణ।
అజ్ఞాన ఘనసమీరణ అఖిల లోకకారణ
విజ్ఞాన దళితావరణ వేదాంత వాక్యప్రమాణ॥

వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద
సత్యాఖండ బోధానంద సద్గుణబృంద।
ప్రత్యస్తమిత భేదకంద పాలిత నంద సునంద
నిత్యద నారాయణతీర్థ నిర్మలానంద గోవింద ॥ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి