15, డిసెంబర్ 2025, సోమవారం

శ్రీచాముండేశ్వరి పాలయమాం


బిళహరి రాగం - ఆది తాళం

మైసూరు వాసుదేవాచార్యుల వారి రచన

పల్లవి:
శ్రీచాముండేశ్వరి పాలయమాం కృపాకరి శంకరి
శ్రితజనపాలిని మహాబలాద్రివాసిని మహిషాసురమర్దిని

అనుపల్లవి:
వాచామగోచర మహిమవిరాజితే వరగుణభరితే
వాక్పతిముఖసురవందితే వాసుదేవసహజాతే

చరణం:
రాకానిశాకరసన్నిభవదనే రాజీవలోచనే 
రమణీయకుందరదనే రక్షితభువనే మణిసదనే 
మూకవాక్ప్రదానవిఖ్యాతే మునిజననుతసుప్రీతే 
శ్రీకరతారకమంత్రతోషితచిత్తే సదా నమస్తే 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి