రాగం: మాండ్
తాళం: ఆది
పల్లవి:
మావల్లగాదమ్మా దేవి యశోద!
నీ సుతు చర్యలు మాటిమాటికి దెల్ప
అనుపల్లవి:
మంగళాంగిరో బాల కృష్ణుడు బల్
గారడి విద్యలు ఘనముగ నేర్చెను
చరణములు:
పాల్ పెరుగు వెన్న మీగడ భాండము
గుర్తు తెలియకనే మాయము జేసెను
కన్య నన్నుజూచి కన్ను సైగజేసి
ఎన్నరాని పను లెన్నెన్నో చేసె
యదుకుల రమణిరో ధూర్త గోపాలుడు పదుగురు చూడ నా అధరము నొక్కెను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి