31, డిసెంబర్ 2018, సోమవారం

శ్రీరామ జయరామ శ్రీలక్ష్మీ నాయక

రచన: శ్రీ ముద్దు బాలంభట్టు

పల్లవి:
శ్రీరామ జయరామ శ్రీలక్ష్మీ నాయక
పారావారవిహార భగవన్నమామి || శ్రీరామ ||

అనుపల్లవి:
నీరూపమును జూచుటెంతో భాగ్యమొకానీ కోరి దక్షిణగా మీకొఱకేమిత్తును స్వామి || శ్రీరామ ||

చరణములు:
ధరణీ గంధము పుష్పధామ మాకాంశంబు పరిమళారతులివ్వ పవనుడుండగను
వరతేజోమయమూర్తి వలన దీపముగాన అరదుగ రసతత్వ మాహారమగుమీకు || శ్రీరామ ||

అని మీ పాదములందు నిర్మాల్యమై మునులు జేసిన పూజలు మునుపే యుండగనుp
ధరమొక్కటియు పంచతత్వాతీతము కంటె ఎనసి జూసిన సృష్టి ఏమైన కనరాదు || శ్రీరామ ||

లోకాతిశయమైన నీ కౌతుకమెల్ల వాకొల్పనెవరికి వశమౌనుదేవా
మీకీర్తి వ్యాసావాల్మీకాదిమునులెల్ల సాకారివని నిన్ను సన్నుతింతురుగాన || శ్రీరామ ||

పూర్వులెన్నగ మంత్రపురమందు నెలకొన్న సర్వకారుడవైన స్వామిమొక్కెదను
ఉర్వీశా నా వలన ఉపచార మిదెగాక అర్హాసనము లివ్వ అలనేనెంతటిదా || శ్రీరామ ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి