31, డిసెంబర్ 2018, సోమవారం

కైలాసవాస గౌరీశ ఈశ

రచన: శ్రీ విజయదాసు 

భాష: కన్నడ

పల్లవి:
కైలాసవాస గౌరీశ ఈశ; తైలధారేయంతె మనసు కొడో హరియల్లి  శంభో || కైలాసవాస ||

చరణములు:
అహోరాత్రియలి నాను అనుచరాగ్రణియాగి
మహియొళగె చరిసిదెనో మహాదేవనె |
అహిభూషణనె ఎన్న అవగుణగళ ఎనిసదలె
విహిత ధర్మది విష్ణు భకుతియను కొడో శంభో || కైలాసవాస ||

మనసు కారణవల్ల పాపపుణ్యక్కెల్ల
అనలాక్ష నిన్న ప్రేరణెయిల్లదె |
దనుజ గజమద వైరి దండ ప్రణామమాళ్పె
మణిసో ఈ శిరవ సజ్జన చరణ కమలదలి || కైలాసవాస ||

భాగీరథీధరనే భయవ పరిహరిసయ్య
లేసాగి నీ సలహో సంతత సర్వదేవా |
భాగవతజన ప్రియ విజయ విఠ్ఠలనంఘ్రి
జాగు మాడదె భజిప భాగ్యవను కొడో శంభో || కైలాసవాస ||

శ్రీరామ జయరామ శ్రీలక్ష్మీ నాయక

రచన: శ్రీ ముద్దు బాలంభట్టు

పల్లవి:
శ్రీరామ జయరామ శ్రీలక్ష్మీ నాయక
పారావారవిహార భగవన్నమామి || శ్రీరామ ||

అనుపల్లవి:
నీరూపమును జూచుటెంతో భాగ్యమొకానీ కోరి దక్షిణగా మీకొఱకేమిత్తును స్వామి || శ్రీరామ ||

చరణములు:
ధరణీ గంధము పుష్పధామ మాకాంశంబు పరిమళారతులివ్వ పవనుడుండగను
వరతేజోమయమూర్తి వలన దీపముగాన అరదుగ రసతత్వ మాహారమగుమీకు || శ్రీరామ ||

అని మీ పాదములందు నిర్మాల్యమై మునులు జేసిన పూజలు మునుపే యుండగనుp
ధరమొక్కటియు పంచతత్వాతీతము కంటె ఎనసి జూసిన సృష్టి ఏమైన కనరాదు || శ్రీరామ ||

లోకాతిశయమైన నీ కౌతుకమెల్ల వాకొల్పనెవరికి వశమౌనుదేవా
మీకీర్తి వ్యాసావాల్మీకాదిమునులెల్ల సాకారివని నిన్ను సన్నుతింతురుగాన || శ్రీరామ ||

పూర్వులెన్నగ మంత్రపురమందు నెలకొన్న సర్వకారుడవైన స్వామిమొక్కెదను
ఉర్వీశా నా వలన ఉపచార మిదెగాక అర్హాసనము లివ్వ అలనేనెంతటిదా || శ్రీరామ ||

27, డిసెంబర్ 2018, గురువారం

గంధము పుయ్యరుగా

రచన: శ్రీ త్యాగరాజ స్వామి
రాగం: పున్నాగవలాళి
తాళం: ఆది

పల్లవి:
గంధము పూయరుగా - పన్నీరు గంధము పూయరుగా || గంధము ||

అనుపల్లవి:
అందమైన యదు నందను పై కుందరదన లిరు వందగ పరిమళ
|| గంధము ||

చరణములు:
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా కల కల మను ముఖ కళదని సొక్కుచు పలుకుల నమృతము లొలికే స్వామికి || గంధము ||

చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా మాలిమితో గోపాల బాలురతో ఆలమేపిన విశాల నయనునికి || గంధము ||

హారతులెత్తరగా ముత్యాల హారతులెత్తరుగా నారీ మణులకు వారము యవ్వన వారక మొసగెడు వారిజాక్షనుకు || గంధము ||

పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా జాజులు మరి విరజాజి దవనములు రాజిత త్యాగరాజ వినుతునికి || గంధము ||

10, డిసెంబర్ 2018, సోమవారం

జగడపు జనవుల జాజర...

రచన: శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య
రాగం: హిందోళ వసంతం
తాళం: ఆది

జగడపు జనవుల జాజర 
సగినల మంచపు జాజర || జగడపు ||

మొల్లలు దురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున 
జల్లన బుప్పొడి జాగర బతిపై 
చల్లే రతివలు జాజర  || జగడపు ||

భారపు కుచముల పైపైగడు సిం- 
గారము నెరపెటి గంధవొడి 
చేరువ పతిపై చిందగ బడతులు
సారెకు జల్లేరు జాజర  || జగడపు ||

బింకపు గూటమి పెనగేటి చమటల 
పంకపు పూతలపరిమళము 
వేంకటపతిపై వెలదులు నించేరు 
సంకుమదంబుల జాజర || జగడపు ||

5, డిసెంబర్ 2018, బుధవారం

ఎక్కడి మానుష జన్మంబెత్తిన...

రచన: శ్రీ పెద్దతిరుమలాచార్య
రాగం: బౌళి
తాళం: ఆది

పల్లవి:
ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను || ఎక్కడి ||

మరవను ఆహారంబును మరవను సంసార సుఖము
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ
మరచెద సుజ్ఞానంబును మరచెద తత్త్వ రహస్యము
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ || ఎక్కడి ||

విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద ఆచారంబును విష్ణుడ నీమాయ || ఎక్కడి ||

తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధంబుల
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై
నగి నగి నను నీవేలితి నాకా యీమాయ || ఎక్కడి ||

4, డిసెంబర్ 2018, మంగళవారం

చక్కని తల్లికి చాంగుభళా

రచన: శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య
రాగం: పాడి
తాళం: ఆది

చక్కని తల్లికి చాంగుభళా తన
చక్కెర మోవికి చాంగుభళా  || చక్కని ||

కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా
పలుకుల సొంపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా || చక్కని ||

కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా || చక్కని ||

జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా || చక్కని ||