భైరవి - ఆట
రచన : శ్రీ తూము నరసింహ దాసు
పల్లవి:
అపరాధినపరాధిని రామయ్య, నే
అనుపల్లవి:
అపరాధి నపరాధి నపరాధి నోరామ
నెపము లెంచక ప్రోచు నెరదాత వీవె
చరణములు:
దిన మెనిమిదిజాముల నొక్క గడియయైన
మనసు నిలిపి నీదు మహిమ వర్ణించి
ఘనులసంగతిఁ గూడి కాలముఁ గడపక
కడు మదమున ముందు గననైతి నకటా - 1
అరిషడ్వర్గములచే నలసటఁ జెందుచు
దురితములకు లొంగి దుఃఖ మందుచును
పరమభక్తులఁ జూచి పరియాచకముఁజేసి
అరసి సద్గతి మార్గనెరుగనైతి నయ్యయో - 2
వాసిగ భద్రాద్రివాసుని దాసాను
దాసుఁడనఁగ భువి భాసిల్లి వేడు
ఆశచే నరసింహదాసుఁడనై భవ
పాశము లెడ జిమ్మి దోసిలొగ్గితినయ్యా - 3
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి