రచన: శ్రీ రామదాసు
రాగం: మధ్యమావతి
తాళం:ఆది
పల్లవి:
ఓ రఘువీరా యని నే పిలిచిన
ఓహో యనరాదా రామసారెకు
వేసరి నామది యన్యము
చేరదు యేరా ధీర రాను ॥ ఓ రఘువీరా॥
చరణం - 1:
నీటచిక్కి కరి మాటికి వేసరి
నాటక ధర నీ పాటలు బాపగమేటి
మకరితల మీటికాచు దయయేటికి
నాపై నేటికి రాదో ॥ ఓ రఘువీరా ॥
చరణం - 2:
మున్ను సభను నాపన్నత వేడుచు
నిన్ను కృష్ణయని ఎన్నగ ద్రౌపదికెన్నో
వలువలిడి మన్నన బ్రోచినవెన్నుడ
నామొర వింటివొ లేదో ॥ ఓ రఘువీరా ॥
చరణం - 3:
బంటునై తినని యుంటె పరాకున
నుంటివి ముక్కంటి వినుత నామజంట
బాయకను వెంట నుండుమనివేడితి
భద్రాచలవాసా ॥ ఓ రఘువీరా ॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి