రచన: శ్రీ త్యాగరాజు
రాగం: చక్రవాక
తాళం: రూపకం
పల్లవి:
సుగుణములే చెప్పుకొంటి
సుందర రఘురామ ॥ సుగుణములే ॥
అనుపల్లవి:
వగలెఱుంగలేక ఇటు వత్తువనుచు
దురాసచే ॥ సుగుణములే ॥
చరణము:
స్నానాది సుకర్మంబులు
వేదాధ్యయనంబు లెఱుఁగ
శ్రీనాయక క్షమియించుము
శ్రీ త్యాగరాజవినుత ॥ సుగుణములే ॥