రచన: శ్రీ నారాయణ తీర్థులు
రాగం: మోహన
తాళం: ఆది
పల్లవి:
బాలగోపాలకృష్ణ పాహి పాహి॥అనుపల్లవి:
నీలమేఘశరీరా నిత్యానందం దేహి॥
చరణాలు:
కలభసుందరగమన కస్తూరిశోభితానన
నళినదళాయతనయన నందనందన
మిళితగోపవధూజన మీనాంకకోటిమోహన
దళితసంసారబంధన దారుణవైరినాశన ॥ 1 ॥
యజ్ఞ యజ్ఞసంరక్షణ యాదవవంశాభరణ
యజ్ఞఫలవితరణ యతిజనతారణ
అజ్ఞానఘనసమీరణ అఖిలలోకకారణ
విజ్ఞానదళితావరణ వేదాంతవాక్యప్రమాణ ॥ 2 ॥
వ్యత్యస్తపాదారవింద విశ్వవందితముకుంద
సత్యాఖండబోధానంద సద్గుణబృంద
ప్రత్యస్తమితభేదకంద పాలితనందసునంద
నిత్యద నారాయణతీర్థ నిర్మలానందగోవింద ॥ 3 ॥