రాగం: మణిరంగు
తాళం: రూపకం
పల్లవి:
నటేశం నమామి సతతం
నగజా నాయకమ్ ॥ నటేశం ॥
అనుపల్లవి:
జటాధరం జలజకరం
జగదాధారం ధీరం ॥ నటేశం ॥
చిత్తస్వరం:
స ని ప మ
త ఝమ్ త రి త
స రి ప మ
త ధిం గి ణ తోం
త కిట ఝం త
ప ణి స ణం త
మ ప రి ప రి
త క త ధిం గి ణ తోం
చరణం:
భవరోగాది విఘాతం
భక్తకోటిజనవినుతం
శివకామవల్లీసహితం
సుబ్రహ్మణ్యప్రియతాతం ॥ నటేశం ॥