రాగం : సునాద వినోదిని
తాళం : ఆది
రచన : మైసూరు వాసుదేవాచార్యులు
కావుమయ్య నన్ను కరుణాలవాల ॥ దేేవా ॥
ఈ వేళ నా యారు శత్రులను
నీవే పారద్రోలి నిజ భక్తు జేసి ॥ దేవా ॥
నే చేసిన పూజాఫలమో
నా పూర్వజుల పుణ్యఫలమో
శ్రీ జానకీశ ఈ జన్మమిచ్చి
నన్ను ధన్యునిగ భావిజేసితివి ॥ దేవా ॥