రచన: జగద్గురు శ్రీభారతీతీర్థ మహాస్వామి, శృంగేరి.
రాగం: నాదనామక్రియ
తాళం: ఆది
కౌసల్యాసుత కుశికాత్మజమఖ రక్షణదీక్షిత రామ
మాముద్ధర శరణాగత రక్షక రవికులదీపక రామ - 1
దశరథనందన దితిసుతఖండన దీనజనావన రామ
పురహరకార్ముక విదళన పండిత పురుషోత్తమ రఘురామ - 2
ఖరదూషణముఖ దితిసుతకానన దావనలనిభ రామ
శబరిగుహ ముఖ భక్తవరార్చిత పాదాంభోరుహ రామ - 3
వాలి ప్రమథన వాతాత్మజ ముఖ కపివర సేవిత రామ
వాసవవిధిముఖ సురవరసంస్తుత వారిజలోచన రామ - 4
దశకంధరముఖ దానవమర్దన రక్షితభువన రామ
సీతానాయక శీఘ్రవరప్రద సర్వజగన్నుత రామ - 5
భర్మవిభూషణ భూషిత విగ్రహ భాధీశానన రామ
భక్తభారతీ తీర్థ సుసేవిత భద్రగిరీశ్వర రామ - 6